ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు జడ్ ప్లస్ భద్రత

posted on: May 14, 2026 8:22AM

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్ లీసా గిల్‌ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్‌కు ముప్పు పొంచి ఉందన్న అంచనాలు, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది....తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. 

దీంతో ఆయన విజయవాడ, గుంటూరు పోలీసు కమిషనరేట్ల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు...రోజూ విజయవాడలోని తన నివాసం నుంచి అమరావతిలోని హైకోర్టుకు ప్రయాణించే మార్గంలో జస్టిస్ లీసా గిల్ కాన్వాయ్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. దీనివల్ల ఆమె ప్రయాణ సమయంలో కాన్వాయ్‌ ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...