వైఎస్, చంద్రబాబులకి దక్కించింది..ఇప్పుడు జగన్‌కి దక్కిస్తుందా..?
posted on Jul 6, 2017 5:53PM
.jpeg.jpg)
మాట్లాడితే ఆఫ్టర్ వన్ ఇయర్‌లో నేనే ముఖ్యమంత్రిని అని ఇప్పటి నుంచే అలా ఫీలవుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ మహా మొండివాడు..అహం చాలా ఎక్కువ..ఎవ్వరు చెప్పినా వినడు..తాను అనుకున్నదే చేస్తాడు..అని సొంతపార్టీ నేతలతోనే అనిపించుకున్నాడు..అలా ఇప్పటి వరకు తనకు తోచింది చేస్తూ వచ్చాడు..అయితే మళ్లీ ఏం భయం పట్టుకుందో..లేక తనకు స్కిల్స్ తక్కువయ్యాయేమో..అనుకున్నట్లున్నాడు..అందుకే రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే పేరు పొందిన ప్రశాంత్ కిశోర్ సూచనలను ఫాలో అవుతున్నారు జగన్. దీనిలో భాగంగా అధికారమే లక్ష్యంగా ఒక పవర్‌ఫుల్ అస్త్రాన్ని రంగంలోకి దించుతున్నాడు. అది అలాంటి..ఇలాంటి అస్త్రం కాదు..తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి..ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారాన్ని అందించిన పాశుపతాస్త్రం..అదే పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఓ అంచనాకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..ఎన్నికల్లో గెలవాలంటే సభలు, దీక్షలు మాత్రమే సరిపోవని..ప్రజలను నేరుగా కలుసుకునే మార్గాలు వెతకమని జగన్‌కు సూచించాడట ప్రశాంత్..దీనికి పాదయాత్రే సరైన మార్గమని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది..దీనిలో భాగంగా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించాలని..ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ని రెడీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారట జగన్..మరి ఆయన పాదయాత్ర ఏపీ చరిత్రలో మరో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.