Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాపం జగన్ కు బ్యాడ్ డేస్..?
posted on: Jan 23, 2016 12:22PM

ప్రస్తుతానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయనే చెప్పొచ్చు. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అధికార పార్టీపై ఎత్తు గడలు వేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవడం సరికదా రివర్స్ లో అధికార పార్టీ పన్నే వ్యూహాల్లో ఈజీగా పార్టీ నేతలు చిక్కుకుంటున్నారు. కారణమేదైనా కానీ గత కొంతకాలంగా జగన్ కు వరుస పెట్టి చిక్కులు ఎదురవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కూడా పార్టీ నేతల వల్ల.
కొద్ది రోజుల క్రితం గుడివాడలో పార్టీ కార్యాలయం ఖాళీ చేసే విషయంలో ఎమ్మెల్యే కొడాలి నానికి.. టీడీపీ కి మధ్య వాగ్వాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాని అరెస్టయ్యారు కూడా. ఈ వ్యవహారంతో మొదలైన తల నొప్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దాని తరువాత తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన హడావుడికి గాను పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక చెవిరెడ్డి సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఏదో ఒక కేసులో ఇరుక్కుంటూనే ఉంటాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదు అయిన కేసులో పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కటకటాల పాలయ్యారు. దీంతో పోలీసులు చెవిరెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్ నుండి పీలేరు.. పీలేరు నుండి నెల్లూరు తిప్పుతూ ఆడుకుంటున్నారు. ఇంకో నేత నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రహదారుల నిర్మాణం అడ్డుకొన్న కేసులో అరెస్ట్ అయ్యారు. ఇలా వరుసపెట్టి పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్నందుకు జగన్ కు ఏం చేయాలో అర్ధంకావట్లేదట.
ఇదిలా ఉండగా జగన్ పార్టీ గురించి.. పార్టీ నేతల గురించి చాలా హాస్యాస్పదంగా మాట్లాడుకున్నాయి రాజకీయ వర్గాలు. తమ పార్టీ అధినేతే కేసులంటూ తిరుగుతున్నాడు.. ఇప్పుడు తమ పార్టీ అధినేత బాటలోనే నేతలు కూడా నడుస్తున్నారని అనుకుంటున్నారు. మరి ఇప్పటికైనా జగన్ మేలుకోవాలని.. ఓదార్పు యాత్రలంటూ తాను తిరుగుతుంటే ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో అని అనుకుంటున్నారు. మరి జగన్ ఏం చేస్తాడో చూడాలి.


.jpg)



