భారతి సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత

posted on: Feb 20, 2026 5:30PM

 

వైయస్సార్ కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన గ్రామాల కుటుంబాలు తమకు న్యాయం చేయాలని శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో గేటు వద్దకు చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరపాలని పట్టుబట్టడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది దీంతో పోలీసులు మోహరించారు. భారతీ సిమెంట్స్ యాజమాన్యం  ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు సరిపోవడం లేదని కార్మికుల ఆవేదన వ్యక్తంచేశారు. 

భూములు తీసుకునేటప్పుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ గేటు ముందు భాదిత కుటుంబాలు ఆందోళన కు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లు మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఆందోళన కారులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితుల హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...