పార్టీలో విజయమ్మ పునర్దర్శనం!
posted on: Sep 10, 2014 8:26PM
.jpg)
మళ్ళీ చాలా కాలం తరువాత వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కొడుకు జగన్మోహన్ రెడ్డి పక్కన పార్టీ సమావేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె పార్టీకి గౌరవాధ్యక్షురాలు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలు స్వయంగా నిర్వహిస్తున్నారు కనుక ప్రస్తుతం ఆమె నిర్వహించాల్సిన గొప్ప బాధ్యతలు ఏమీ లేవనే అనుకోవచ్చును. ఒకవేళ వచ్చే నెల నుండి పార్టీ మొదలుపెట్టబోయే ఉద్యమంలో పాల్గోనేందుకే ఆమె కూడా వచ్చారని భావించడానికి బలమయిన కారణాలు లేవు. ఎందుకంటే మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు లేవు కనుక అంతవరకు పార్టీని చెదిరిపోకుండా పట్టి ఉంచుతూ, పార్టీ శ్రేణులను చైతన్యపరిచేందుకే ఈ ఉద్యమం ఉపయోగపడుతుంది తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదనే చెప్పవచ్చును. మరి అటువంటప్పుడు విజయమ్మ ఆ ఉద్యమంలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా అఆమే వల్ల పార్టీకి కానీ, పార్టీ వల్ల ఆమెకు గానీ కొత్తగా కలిగే ప్రయోజనము ఏమీ ఉండబోదు. అయితే మరి విజయమ్మ హటాత్తుగా పార్టీ సమావేశంలో ఎందుకు పాల్గొన్నట్లు? అనే సందేహం కలగడం సహజమే. బహుశః జగన్మోహన్ రెడ్డిపై మళ్ళీ సీబీఐ కేసుల జోరు అందుకోవడం చూసి ముందు జాగ్రత్తగా ఆమె మళ్ళీ పార్టీ వ్యవహారాలు చూసుకొనేందుకు వచ్చేరేమో? ఏమయినప్పటికీ 11 చార్జ్ షీట్లలో A-1 నిందితుడిగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు పార్టీని సన్నధం చేయడం మంచి ఆలోచనే.



.jpg)
.jpg)

.webp)



