మళ్ళీ పరామర్శకు బయలుదేరనున్న షర్మిల

posted on: Jan 17, 2015 6:48AM

 

కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో మెహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర నిర్వహించిన వై.యస్. షర్మిల మళ్ళీ ఈనెల 21వ తేదీ నుండి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఆమె ఈసారి తన యాత్రలో ఏడు రోజులపాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి మొత్తం 30 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. జిల్లాలోని దేవరకొండ నుండి ఆమె యాత్ర మొదలుపెట్టి సూర్యాపేట వద్ద ముగిస్తారు. మళ్ళీ కొద్దిరోజుల విరామం తరువాత జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.

 

ఆమె చేసేది పరామర్శ యాత్రలే అయినప్పటికీ, అదేదో రాజకీయ యాత్ర అన్నట్లుగా ఆమె యాత్రలు మొదలుపెడుతున్న ప్రతీసారి వైకాపా అందుకోసం ప్రత్యేకంగా పోస్టర్లు రూపొందించి విడుదల చేసి విస్తృతంగా ప్రచారం చేయడం గమనిస్తే ఆమె చేస్తున్న ఆ యాత్రల పరమార్ధం ఏమిటో అర్ధం అవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...