Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుష్కరాల్నీ వదిలిపెట్టని... ముష్కరులు!
posted on: Aug 17, 2016 4:33PM
.jpg)
కృష్ణ పుష్కరాలు జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో జనం సాధ్యమైనంత ఎక్కువగా తమ పాపాల్ని కడిగేసుకుంటున్నారు పవిత్ర జలాల్లో. అందుకోసం మూడేసి సార్లు మునకలు వేస్తూ దోసిళ్లతో నీళ్లు వదులుతున్నారు! కాని...ఫేస్బుక్ లాంటి సోషల్ నెటవర్క్ ప్రపంచంలో మాత్రం జనం దుష్ప్రచార స్రవంతిలో మునిగితేలుతున్నారు. చంద్రబాబు పుష్కర స్నానంపై జరుగుతున్న యాగీ చూస్తే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది!
చంద్రబాబు పుష్కర స్నానం షర్టు విప్పకుండానే చేశాడనీ, కనీసం తల తడిసేలా పూర్తిగా మునగనైనా మునగలేదని కొందరు కథనాలు రాసుకుంటున్నారు. ఆయనంటే గిట్టని యాంటీ టీడీపీ బ్యాచ్ మరో అడుగు ముందుకేసి వైఎస్, జగన్ అయితే శాస్త్ర ప్రకారం పుష్కర స్నానం చేశారని ఫోటోలు పెడుతూ ఋజువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి పుష్కరాల ప్రారంభోత్సవం కోసం పుణ్య స్నానం చేస్తే ఆయన సరిగ్గా చేయలేదని విమర్శలు చేయటం అతి తెలివో, మూర్ఖత్వమో అవుతుంది. అంతే తప్ప తెలివి అనిపించుకోదు.
చంద్రబాబు ఏ కారణం చేత షర్టు విప్పకుండా , పూర్తిగా మునగకుండా స్నానం చేసినా అది ఆయన వ్యక్తిగత సమస్య. అంతే కాని, దాని వల్ల నవ్యాంధ్రకో, అమరావతికో ఎలాంటి గండమూ లేదు. మరి అటువంటప్పుడు ఆయన ఘోర నేరమో, పాపమో చేసినట్టు పనికట్టుకుని ప్రచారం చేయటం ఎందుకు? అంతకన్నా బెటర్ కోడి గుడ్డుపై ఈకలు పీకటం... ఏమంటారు?






