Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ హైదరాబాద్ పర్యటన.. స్వాగత ఫ్లెక్సీలపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు.!
posted on: Aug 21, 2026 3:13PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సందర్భంగా ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ జగన్ ఏదో బీఆర్ఎస్ నాయకుడా అన్నట్లుగా ఆ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉన్నాయి. ఈ ఫ్లెక్సీల్లో జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
గతంలో వైసీపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యం దృష్ట్యా ఇప్పుడీ పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, పొలిటికల్ చర్చకు తెరలేపాయి. జగన్ పర్యటనలూ ర్యాలీలలో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు.. తెలంగాణలో వైసీపీ, బీఆర్ఎస్ ల పొత్తకు సంకేతాలా అన్న చర్చకు తెరలేచింది.
తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, వైసీపీల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఏదైనా కుదిరిందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే తెలంగాణ స్థానిక పోరులో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలంటే.. అందుకు జనసేన రంగంలో ఉండటం ఒక విధంగా జనసేన పోటీ బీఆర్ఎస్ విజయావకాశాలకు గండి కొట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఏపీకి చెందిన వారు జనసేన వైపు మొగ్గు చూపుతారనీ, అలా జరగకుండా అడ్డుకోవాలంటే..జగన్ సహకారం అవసరమనీ బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉండటంతో రానున్న రోజులలో వైసీపీ, బీఆర్ఎస్ పోత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్వర్యం లేదని అంటున్నారు.
YS Jagan Hyderabad Visit, BRS YSRCP Flexis Begumpet, Jagan Jalavihar Wedding Visit, Telangana Politics Updates, KCR KTR YS Jagan Cutouts






