సీఎం పదవిపై జగన్ పగటి కలలు!
posted on Apr 11, 2014 12:19PM

తెలంగాణ ప్రాంతలో తన పార్టీ తుడిచిపెట్టుకుపోయినా, సీమాంధ్రలో తన పార్టికి సౌండ్ లేకపోయినా వైసీపీ అధినేత జగన్ కంటున పగటి కలల జోరు ఎంతమాత్రం తగ్గలేదు. సీమాంధ్రకి కాబోయే ముఖ్యమంత్రి తానేని జగన్ చెబుతున్నారు. ఒఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్ తన పగటి కలలను పూసగుచ్చినట్టు వివరించారు. ఆయన కంటున్న పగటి కలలలో కొన్న పాయింట్లు ఇవి.... .....నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. సీమాంధ్ర ప్రజలంతా పూర్తిగా నావైపే వున్నారు.
.....కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలి? దానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను.
.....కొత్త రాజధాని నిర్మాణం కోసం నేను అంతర్జాతీయ కన్సల్టెంట్‌తో మాట్లాడుతున్నా. కొత్త రాజధాని పేరు కోస్తా ఆంధ్ర, రాయలసీమ రెండూ ప్రాంతాలనూ ప్రతిబింబించేలా వుంటుంది.
.....జపాన్‌లో పరిశ్రమలు నిర్మించడానికి స్థలం లేదు. వాళ్ళంతా సీమాంధ్రలో పెట్టుబడులు పెడతారని నేను అనుకుంటున్నాను.