Latest News

ఏపీలో వుండాలంటేనే భయమా? అబ్బ ఛా!

posted on: Jul 9, 2014 2:13PM

 

వైసీపీ నాయకుడు జగన్ గారు నిన్నగాక మొన్న ఒక సూపర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాల ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ నెత్తిన తెల్లగుడ్డ పడింది. చాలామంది వైసీపీ నాయకులు సదరు పార్టీకి గుడ్‌బై చెప్పేసి తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. వైపీసీ మనుషుల్ని పెట్టి వాళ్ళని ఆపాలని ప్రయత్నించినప్పటికీ జగన్ ధోరణికి విసిగిపోయి వున్న చాలామంది ఆ పార్టీ నాయకులు టీడీపీ అధ్యక్ష అభ్యర్థలకు మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని జగన్ గవర్నర్ దగ్గరకి వెళ్ళి తన బాధని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ గారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వుండాలంటేనే భయం వేస్తోందనే మాట వాడారు. జగన్ ఈ మాట వాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం జగన్. రాష్ట్ర విభజన జరగడానికి కూడా ఆయనే ప్రధాన కారణం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకోనివ్వకుండా అడ్డు పడుతున్న వ్యక్తి జగన్. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెడుతున్న జగన్ తాను భయపడిపోతున్నానని అనడం చాలా కామెడీగా వుందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి విచిత్రమైన కామెంట్లు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేయకుండా, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తే బాగుంటుందని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...