అక్రమ ఆస్తుల కేసులో జగన్‌కు చుక్కదెరు
posted on Nov 11, 2025 8:00PM
.webp)
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 21 న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనిక్కి తీసుకున్నారు.
కొంత సమయం ఇస్తే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇందుకోసం వారం రోజులు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరగా.. ఈనెల 21 వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. యూరప్ పర్యటనకు వెళితే ఈ నెల 14వరకు కోర్టుకు హాజరు కావాలని గతంలోనే సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.