జగన్ జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టలేరు.!

posted on: Aug 13, 2026 6:17PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల  సమావేశాలు ఈ నెల   17 నుంచీ ప్రారంభం కానున్న తరుణంలో.. జగన్, వైసీపీ సభ్యుల గైర్హాజర్ నిర్ణయం మళ్లీ సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. వైసీపీ సభ్యుల సభా బహిష్కరణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

  నిబంధనల ప్రకారం రాని  ప్రతిపక్ష హోదా  కోసం మంకుపట్టు పడుతూ సభకు రాకపోవడంపై విమర్శల నేపథ్యంలో ప్రముఖ విశ్లేషకుడు మధుసూదన్ రడ్డి తెలుగువన్ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  అసెంబ్లీకి జగన్ ముఖం చాటేయడానికి అసలు కారణం భయం అన్నారు.  ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. 

అయితే ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదన్న నిర్ణయానికి.. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను అవమానించినట్లుగానే ఇప్పుడు తానూ అవమానాలను ఎదుర్కోవలసి వస్తుందన్న భయమే కారణమని చెప్పారు.   అసెంబ్లీలో  తన తప్పులు బయటపడతాయనే భయంతో పాటు, సభలో ఎదురయ్యే విమర్శలు, అవమానాలనూ తలచుకుని భయపడుతుండటg వల్లే జగన్ అసెంబ్లీకి గైర్హాజరౌతున్నారని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే రాదనీ, జనం అందుకు అవసరమైనంత మంది సభ్యులను గెలిపించి సభకు పంపాల్పి ఉంటుందనీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.  

సభకు హాజరు కాకుండానే నిస్సిగ్గుగా జనగ్, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలూ జీత భత్యాలు తీసుకుంటున్నారని విమర్శింారు.  సామాన్య ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే జీతాలు కోత విధిస్తారనీ, మరి శాసనసభకు రాని ఎమ్మెల్యేలకు ప్రజల సొమ్ముతో జీతాలు ఎందుకు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు.  

చట్టసభలకు వరుసగా గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలన్నారు. సభకు 60 రోజుల పాటు హాజరుకాని పక్షంలో స్పీకర్ అధికారాలను ఉపయోగించి అనర్హత నిర్ణయం తీసుకోవాలన్నారు.  వైసీపీ తీరు ఇలాగే ఉంటే.. ఆ పార్టీ భవిష్యత్ లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న మధుసూదన్ రెడ్డి.. ఆ విధంగా జగన్ తన జీవితంలో మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేరన్నారు.  రాజ్యాంగబద్ధమైన సభను గౌరవించకుండా, ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. 

YS Jagan, AP Assembly Sessions, YSRCP, Andhra Pradesh Politics, TOne News

google-ad-img
    Related Sigment News
    • Loading...