Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విడాకుల సెటిల్మెంట్ కు డబ్బులు లేక యువకుడు ఆత్మహత్య
posted on: Jun 8, 2026 2:39PM
.webp)
రెండేళ్ల క్రితం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఓ యువకుడు, తన వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జీవిత భాగస్వామి తో ఆనందంగా జీవించాలని కలలు కన్నాడు. అయితే పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. క్రమంగా ఆ గొడవలు తీవ్రరూపం దాల్చి.. చివరకు విడాకుల వరకు వెళ్లాయి. చివరకు యువకుడి ఆత్మహత్యతో ఈ కుటుంబ వివాదం విషాదకరంగా ముగిసింది.
ఈ విషాదకర మైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు... అనంతరం పెద్దమనుషుల సమక్షంలో ఇరువర్గాల మధ్య పలుమార్లు రాజీ చర్చలు జరిగాయి. చివరకు కొంత మొత్తం చెల్లించి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని పెద్దలు నిర్ణయించారు.
అయితే సెటిల్మెంట్ కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోవడానికి జాకబ్ నానా తంతాలు పడ్డాడు..డబ్బుల కోసం తెలిసిన వారి వద్ద అప్పుకు కూడా ప్రయత్నాలు చేశాడు.కానీ ఎవ్వరి దగ్గర నుండి సహాయం అందకపో వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జాకబ్, చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు..కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాకబ్ మృతికి దారితీసిన పరిస్థితులు, కుటుంబ వివాదాల నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.


.webp)
.webp)


