Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన తీవ్ర దుమారం
posted on: Feb 21, 2026 2:06PM

ఢిల్లీలో భారత్ మండపం వద్ద జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్థనగ్న ప్రదర్మన పెను దుమారం రేపుతోంది. ఈ నిరసన వెనుక అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీసే భారీ కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు పటియాలా హూస్ కోర్టులో ఆరోపించారు. అరెస్ట్ అయిన నలుగురు నేతలను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. గతంలో నేపాల్‌లో జరిగిన ఆందోళనల తరహాలోనే ఇది ముందుస్తు ప్లాన్ ప్రకారం జరిగిందని పోలీసులు తెలిపారు.
మరోవైపు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు షర్ట్‌లు విప్పి నిరసన తెలిపారు. ఈ ఘటనతో కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ నిరసనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. “దేశంలోని యువత, రైతులు, వ్యాపారుల ఆందోళనను యూత్ కాంగ్రెస్ సహచరులు వ్యక్తం చేశారు” అంటూ పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ వేదికలో పేర్కొంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా యువత, రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆరోపించింది. నిరసన తెలియజేయడం రాజ్యాంగబద్ధ హక్కు అని, ప్రజల స్వరం వినిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయ స్థాయి సదస్సుకు అంతరాయం కలిగించడాన్ని ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ఈ ఘటనను తీవ్రంగా విమర్శించగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ దేశ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యగా అభివర్ణించారు.
సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ , ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న నిరసన మరింత చర్చనీయాంశమైంది.కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, రైతు ప్రయోజనాలే తమకు ప్రాధాన్యమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. ప్రతిపాదిత ఒప్పందంపై పూర్తి వివరాలు వచ్చే నెలలో వెల్లడిస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు క్యూఆర్ కోడ్‌లతో భారత్ మండపంలోకి ప్రవేశించి ఈ నిరసన చేపట్టారు.


.webp)



