Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అక్కను చంపి ముక్కలుగా నరికిన తమ్ముడు
posted on: Mar 18, 2026 7:03PM

హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న ఓ తమ్ముడికి అక్కంటే చాలా ఇష్టం... అక్క, బావ కలిసి మెలిసి ఉండడం చూసి సంతోష పడేవాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం బావ చనిపోయాడు. దీంతో అక్కలో మార్పు వచ్చింది. అది గమనించిన తమ్ముడు అక్కను పలుమార్లు మందలించాడు. అందుకు అక్క నిరాకరించింది. దీంతో తమ్ముడు అక్కను వదిలేసాడు..కొద్దిరోజుల తర్వాత అక్క కనిపించకుండా పోయింది. తన అక్క మరో వ్యక్తితో వెళ్లిపోయింది.. కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు... ఇక్కడి వరకు కథ బాగా నచ్చింది. అయితే పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయడంతో విస్సుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తమ్ముణ్ణి అదుపు లోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్య చకితులయ్యారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేదించారు... వివరాల్లోకి వెళితే...అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారంలో నీలా(40), తన తమ్ముడు పప్పుతో కలిసి నివాసం ఉంటుంది.. నీలా భర్త కొన్నాళ్ల క్రితమే చనిపో యాడు.. దీంతో నీలా ప్రవర్తనలో మార్పు వచ్చింది. బావ చనిపోయిన తర్వాత అక్క నీలా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేది. అది గమనించిన తమ్ముడు పప్పు పలుమార్లు అక్కను మందలించాడు.
అయినా కూడా అక్క నీలాలో మార్పు రాలేదు సరి కదా ఇంకా ఎక్కువగా చెడు తిరుగుళ్ళు తిరిగేది... దీంతో విసుకు చెందిన పప్పు ఎలాగైనా సరే అక్కను అంతం చేయాలనుకున్నాడు. దీంతో పప్పు గత నెల ఫిబ్రవరి 28వ తేదీన అక్క నీలాను చంపేశాడు. అనంతరం బాత్రూంలో అక్క మృత దేహాన్ని ముక్కలు ముక్క లుగా నరికి గోనె సంచిలో నింపి కారులో తీసుకెళ్లి మజీద్ పుర చెరువులో కొన్ని బాడీ పార్ట్స్ పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను చెరువు పక్కన ఉన్న చిట్టడవిలో పడేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన అక్క లీల కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు... అంతేకాకుండా పోలీసుల దగ్గర అక్క మీద ప్రేమ ఉన్నట్లుగా తెగ నటించాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగించారు. అయితే పప్పు ఈనెల రెండవ తేదీన అక్క సెల్ ఫోన్ నుండి తనకు తాను మెసేజ్ పెట్టుకున్నాడు.. తన అక్క ఎవరితోనో వెళ్ళిపోయింది అంటూ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులకు పప్పు ప్రవర్తనపై అనుమానం వచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలోనే తమ్ముడు పప్పు కాల్ డేటా బయటికి తీసిన పోలీసులు అది చేసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యారు. అనంతరం పోలీసులు పప్పును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.మజీద్‌పురా చెరువు పక్కన ఉన్న చిట్టడవిలో గుర్తించిన శరీర భాగాలతో కేసు ఛేదించారు. దీంతో పోలీసులు పప్పును అరెస్టు చేశారు.






