Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అఫ్జల్‌గురు అమరుడైతే మరి హనుమంతప్ప ఎవరు?
posted on: Feb 17, 2016 3:53PM
.jpg)
ఒలింపిక్స్ సహా భారతదేశం కోసం ఎన్నో పతకాలను గెలుచుకున్న యోగేశ్వర్ దత్ రాసిన ఒక పద్యం ఇప్పడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. మల్లయుద్ధంలో యోధుడిగా పేరుతెచ్చుకున్న ఈ హర్యానా క్రీడాకారుడు ఇప్పడు అందరి నాలుకలలోనూ నిలుస్తున్నాడు. దేశం తరఫున అనేక ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొన్న యోగేశ్వర్‌కి జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సంఘటనలని చూసి బాధ కలిగినట్లుంది. 19 పంక్తులలో తన భావాలను ఒక పద్యరూపంలో రాశాడు. ఇందులో అఫ్జల్ గురు వంటి తీవ్రవాదులని ఆరాధించేవారు గజనీ వంటి వారని పేర్కొన్నాడు. దేశానికి ద్రోహం చేసిన అఫ్జల్‌గురు అమరుడైతే మరి సియాచిన్లో ప్రాణాలర్పించిన హనుమంతప్ప ఎవరు అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడే భావస్వేచ్ఛ గురించి కూడా యోగేశ్వర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు యోగేశ్వర్. జన్మనిచ్చిన భూమిని శత్రువుగా భావిస్తున్నారంటూ ఆవేదన చెందాడు. దేశమాతను అవమానించిన, దేశం పరువుతీసే నినాదాలను భావస్వేచ్ఛగా ఎలా భావించగలం అంటూ ప్రశ్నించాడు. యోగేశ్వర్ దత్ రాసిన ఈ పద్యం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఇప్పుడు కార్చిచ్చులా వ్యాపిస్తోంది. ప్రస్తుతానికి ఈ పద్యాన్ని దాదాపు లక్షమందికి పైగా చదివినట్లు అంచనా! మరి అసలైనవారు చదివారో లేదో!


.jpg)



