Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అగ్రరాజ్యంలో యోగా ఫీవర్.. ఘనంగా యోగా డే!
posted on: Jun 20, 2026 8:31AM
.webp)
భారత ప్రాచీన సంస్కృతి, జీవన విధానమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అగ్రరాజ్యంలో యోగా ఫీవర్ అక్కడి వారిని కుదిపేస్తోంది. వాషింగ్టన్ యోగా ప్రాభవం మరోసారి డిజిటల్ తెరపై ప్రకాశించింది. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన వాషింగ్టన్ లింకన్ మెమోరియల్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ భారీ ఈవెంట్‌లో వందలాది మంది అమెరికన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నేషనల్ మాల్ మొత్తం ఒక పెద్ద బహిరంగ యోగా శిబిరంగా మారిపోయింది.
ఈ ఏడాది వేడుకలను ఒక ప్రత్యేకమైన థీమ్ తో నిర్వహించారు. "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ధీమ్ తో ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేవలం భారత సంతతి ప్రజలే కాకుండా, అమెరికన్ పౌరులు, ప్రఖ్యాత యోగా శిక్షకులు, పలువురు ఉన్నతాధికారులు కూడా భాగస్వాములయ్యారు. .
ఈ వేడుకల్లో భాగంగా అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తన ప్రసంగంలో భారత ప్రాచీన సంప్రదాయం నుంచి పుట్టిన యోగా, నేడు గ్లోబల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ ఆచరించే ఒక గొప్ప జీవనశైలిగా రూపాంతరం చెందిందన్నారు. చారిత్రాత్మక లింకన్ మెమోరియల్ వద్ద 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంత భారీ ఎత్తున జరుపుకోవడం గర్వకారణమన్న ఆయన . యోగా అనేది ఏ ఒక్క దేశానికో, మతానికో లేదా సంస్కృతికో పరిమితమైనది కాదనీ.. ఇది సరిహద్దులను దాటి మానవాళినంతటినీ ఏకం చేసే మహత్తర శక్తి అని అభివర్ణించారు. అమెరికా సమాజంలో యోగా కేవలం ఒక ట్రెండ్ లాగా ప్రాచుర్యం పొందడమే కాకుండా.. అక్కడి ప్రజల నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన అంతర్భాగంగా మారిపోయిందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విదేశీయులు, ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. యోగా సాధన వల్ల తమ శరీరం, మనస్సు ఆత్మ నూతనోత్తేజంతో రీఛార్జ్ అయ్యాయన్నారు. మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా యోగాను వారు అభివర్ణించారు.






