Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ రాజకీయ ‘యోగా’ ఏంటో!
posted on: Jun 15, 2015 8:43PM

రాజకీయ నాయకులకు రాజకీయం చేయడానికి ఏ అంశం దొరికినా చాలు అల్లుకుపోతారు. అధికారంలో ఉన్నవాళ్ళకంటే, ఎప్పటి నుంచో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళకంటే నిన్నగాక మొన్నటి వరకూ అధికార భోగాల్లో తేలిపోయి, ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నవాళ్ళయితే చీమ తలకాయ లాంటి అంశం దొరికినా వదిలిపెట్టకుండా రాజకీయం చేసేస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే వుంది. అందుకే ఏ అంశమూ లేనట్టుగా కేంద్ర ప్రభుత్వం జూన్ 21న నిర్వహించ తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని రాజకీయాల్లోకి లాగింది.
కేంద్ర ప్రభుత్వం యోగా అంటే ఇష్టం లేనివాళ్ళ చేత, హిందూయేతరుల చేత కూడా ఆ రోజున యోగా చేయించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకోవడం ప్రారంభించారు. యోగాలో భాగమైన ‘ఓం’ అనే పదాన్ని హిందూయేతరులు ఎలా ఉచ్ఛరిస్తారని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న ఈ ధోరణిని చూస్తుంటే ఇంతకాలం ఈ పార్టీ దేశంలో మత విద్వేషాలను ఎలా రెచ్చగొట్టిందో అర్థమవుతోంది. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాని హిందూ మతంతో ముడిపెట్టడమే కాకుండా, యోగా ఇతర మతాలకు వ్యతిరేకం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అల్లుడు గారు రాబర్ట్ వధేరా కూడా ఈ అంశంలో తన వంతు పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించే ప్రయత్నంలో బిజీగా వున్నారు.






