సీనియర్లను కాదని... కొత్త ముఖానికి కీలక బాధ్యత.. వైసీపీ ఎమ్మెల్సీల ఫిరాయింపు ఎపిసోడ్ మిస్ ఫైర్..

posted on: Mar 1, 2026 3:48PM

వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడానికి సుముఖంగా ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పటికే వైసీపీకి ఐదుగురు ఎమ్మెల్సీలు  రాజీనామా చేశారు. వారి రాజీనామాలపై శాసనమండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు. తాజాగా మరింత మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడానికి మంతనాలు సాగించారన్న వార్తలు వినవస్తున్నాయి. ఇవి వైసీపీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. వైసీపీలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చి పార్టీలో కీలకంగా మారిన సీనియర్‌మోస్ట్ నాయకుడి సారథ్యంలో,  దాదాపు పది మందికి పైగా ఎమ్మెల్సీలు అధికారపక్షంలో చేరడానికి ఇప్పటికే మంతనాలు కూడా కొనసాగించారంట. అయితే ఆ చర్చలు మిస్‌ఫైరయ్యాయనీ, దీంతో  వారు గమ్మున ఉండిపోయారంటున్నారు. ఈ విషయం వైసీపీ అధ్యక్షుడు జగన్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. 

అసలే కొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం, వారి రాజీనామాలు ఆమోదిస్తే శాసనమండలిలో కూడా బలం తగ్గిపోతుందని టెన్షన్ పడుతున్న జగన్ ప్రస్తుత వ్వవహారంపై సీనియస్ అయ్యారంట. తాజాగా పార్టీని వీడటానికి రెడీ అయిన ఎమ్మెల్సీల టీమ్‌కు నాయకత్వం వహించినట్లు ప్రచారం జరుగుతున్న పెద్దాయనపై జగన్ సీరియస్ అయి, తీవ్ర వత్తిడి తీసుకొచ్చారంట. ఆ క్రమంలోనే సదరు ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారంటున్నారు. జగన్ తెస్తున్న ఒత్తిడి  కారణంగా వారిలో ఒకరు అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. 

అదలా ఉంటే పార్టీ మారడానికి సిద్దమైన ఎమ్మెల్సీలతో రాయబారం నడపటానికి అధికారపక్షం .. ప్రత్యక్ష రాజకీయాల అనుభవం లేని ఒక కార్పొరేట్ నాయకుడిని రంగంలో దింపిందంట. ప్రస్తుతం టీడీపీలో అనూహ్యంగా ఒక ‘పెద్ద’పదవి దక్కించుకున్న ఆ గోదావరి జిల్లాల నాయకుడు ఆ తతంగాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో వ్యవహారం మొత్తం మిస్‌ఫైర్ అయిందంటున్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్సీల వలసలు తాత్కాలికంగా ఆగిపోయాయంట. అదే ఇప్పుడు అధికార పక్షంలో హాట్ టాపిక్‌గా మారి పార్టీలోని సీనియర్లు అధినాకత్వంపై చిర్రుబుర్రులాడుతున్నారు.

వైసీపీ వారితో చర్చలకు ఏం అనుభవముందని సదరు నేతని పురమాయించారని అధిష్టానంపై సీనియర్లు ఆఫ్ ద రికార్డుగా మండిపడుతున్నారు. సీనియర్లకు ఆ బాధ్యతలు అప్పగించి ఉంటే అంతా సజావుగా సాగిపోయి, జగన్‌కు చావుదెబ్బ కొట్టగలిగి వారిమని అంటున్నారంట.  సీనియర్లను కాదని  కొత్త ముఖానికి  కీలక బాధ్యతలు కట్టబెడితే ఇలాగే ఉంటుంది మరి అన్న విమర్శలు వినవస్తున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...