Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమరావతిపై వైసీపీ విషం... పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు సజ్జల హెచ్చరిక
posted on: Apr 10, 2026 8:08PM
.webp)
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి గిట్టదని ఆ పార్టీ నేతలు తమ ప్రకటనలతో పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్నారెడ్డి మాటలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైసీపీకి సుతరామూ ఇష్టం లేదని మరో సారి ప్రస్ఫుటంగా రుజువైంది. అమరావతిలో పెట్టుబడులు పెడితే కృష్ణ నదిలో కలిసినట్లేనని పెట్టుబడి దారులను హెచ్చరించింది. ఈ పార్టీ కీలక నేత, జగన్ హయాంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుబడిదారులను అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ హెచ్చరిక జారీ చేశారు. రాజధాని అమరావతి పేరుతో సాగుతున్నదంతా అబద్ధపు ప్రచారమేనన్నారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
సజ్జల, వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నా.. వాస్తవానికి అక్కడ పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం చేపట్టాయి. అవి దాదాపు తుది దశకు వచ్చాయి. ఇక స్టార్ హోటళ్లు, పలు వాణిజ్య, వ్యాపార సంస్థలు కార్యకలపాల నిర్వహణకు రెడీ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో అమరావతిలో పెట్టుబడులు పెడితే ఆ సొమ్ములు కృష్ణా నదిలో పారబోసినట్లే నంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమరశలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి అభివృద్ధిని, అక్కడ వచ్చే పెట్టుబడులు అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మావిగన్ ప్రతిపాదనతో వైసీపీ అధినేత జగన్ ఒక ట్రోల్ మెటీరియల్ గా మారినట్లుగానే అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ సజ్జన చేసిన హెచ్చిరకపై కూడా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడమే వైపీపీకి తెలుసుననీ, అభివృద్ధి అంటే గిట్టదనీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు ప్రపంచం మొత్తం అమరావతివైపు చూస్తుంటే వైసీపీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని అక్కడ ఏమీ లేదని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.
జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసిన సంగతిని జనం మరిచిపోలేదని, ఇప్పుడు మళ్లీ అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం ఆ పార్టీనే కబలించేస్తుందని అంటున్నారు పరిశీలకులు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న వైఖరి ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.






