Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెంటికి చెడ్డ రేవడిలా ఆదినారాయణరెడ్డి..
posted on: Jan 7, 2016 1:42PM
.jpg)
కడప జిల్లా జమ్ములమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా అయింది. ఎప్పటినుండో టీడీపీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్న ఆదినారాయణరెడ్డికి మాత్రం ఇప్పటి వరకూ ఎంట్రీకి ఛాన్స్ మాత్రం రాలేదు. అయితే ఆదినారాయణ రెడ్డి ఎంట్రీకి టీడీపీ సీనియర్ నేత పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామసుబ్బారెడ్డి మాత్రం ఒప్పుకోవడంలేదు. ఇదే విషయాన్ని ఆయన అధినేత చంద్రబాబుకు కూడా చెప్పారు. దీంతో చంద్రబాబు కూడా ఆదినారాయణ రెడ్డి ఎంట్రీపై డైలమాలో పడ్డారు. దీంతో రామసుబ్బారెడ్డి ఒత్తిడితో ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకునే విషయంలో టీడీపీ వెనక్కు తగ్గిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆది నారయణ రెడ్డి కనుక వస్తే తాను వైసీపీ లోకి వెళతానని కూడా బెదిరించారట రామసుబ్బారెడ్డి. ఇక తన ఎంట్రీకి రామ సుబ్బారెడ్డి అడ్డుపడుతున్నాడని గమనించిన ఆదినారాయణరెడ్డి లాభం లేదని టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నానని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అయినా కూడా ఆదినారాయణరెడ్డి ఎంట్రీకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు టీడీపీలో చేరాలని తాము ఎవ్వరిని ఆహ్వానించలేదని…అది కేవలం మీడియా సృష్టే అని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విస్ట్ ఇచ్చారు.
మరోవైపు జగన్ కూడా ఆదినారాయణ రెడ్డి టీడీపీ చేరికపై స్పందిచినట్టు తెలుస్తోంది. ఇటీవల జమ్ములమడుగు పర్యటనకు వచ్చిన జగన్ పార్టీ నుండి ఎవరు వెళ్లిపోయినా పర్వాలేదు..ఉన్నవాళ్లే నావాళ్లు అని పరోక్షంగా ఆదినారాయణరెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో ఆదినారాయణరెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అటు టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ రాక.. ఇటు వైసీపీ కి కూడా చేరువ కాలేక ఎటూ తేల్చుకోలేక రెంటికి చెడ్డ రేవడిలా అయింది.


.jpg)



