ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నాయకులు



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాల కడలిలో ఓటి పడవలో ప్రయాణం చేస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని కలలు కన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని అంతా భ్రాంతియేనా అని పాటలు పాడుకునే పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో త్వరలో భారీ మార్పులు జరగబోతున్నాయిని, చాలామంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికారానికి దూరంగా వుండటం కావచ్చు... పార్టీ నాయకుడు జగన్ వ్యవహార శైలి కావచ్చు... ఇలా ఎన్నో కారణాల వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతో అసంతృప్తిలో వున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆ అసంతృప్తి ఫ్రఫ్ట్రేషన్ రూపంలోకి మారి, ఆ తర్వాత ఆగ్రహంగా మారి చివరికి అభాసు పాలయ్యేలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినవారుగానీ, ఇతర వైసీపీ నాయకులు కానీ గత ఎన్నికల ముందు ఈ ఎన్నికలలో తమదే విజయం అనుకుని కలలు కన్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితి తలకిందులు అయింది. ప్రతిపక్షంలో కూర్చుని అధికార పార్టీ మీద విమర్శలు చేసే విషయంలో జగన్ ఆదేశానుసారం పనిచేయడం తప్ప స్వతంత్రం కూడా లేకుండా పోయింది. దానికితోడు ఇప్పటికే అందరూ బోలెడంత ఖర్చులు పెట్టేశారు. అధికారంలో వుంటే కాంట్రాక్టుల ద్వారానో మరో మార్గంలోనో పెట్టుబడి తిరిగి రాబట్టుకునే అవకాశం వుండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అధికార  పార్టీతో మంచిగా వుండి కావలసిన పనులు చేయించుకునే ఛాన్స్ కూడా పార్టీ నాయకుడు ఇవ్వడం లేదు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలలో ఫ్రఫ్ట్రేషన్ పెరిగిపోతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గుర్నాథరెడ్డి, భూమా నాగిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పేర్ని నాని సందర్భం దొరికితే చాలు ఆవేశంతో రగిలిపోతున్నారు. వీధి పోరాటానికి కూడా సిద్ధమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ నాయకులు ఎదుర్కొంటున్న ఫ్రఫ్ట్రేషన్ నుంచి బయట పడాలంటే యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం లేదా అధికార పార్టీలోకి జంప్ చేయడం... ఈ రెండే మార్గాలేమో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu