వైపీపీ నేత పూడి శ్రీహరికి హైకోర్టులో చుక్కెదురు

posted on: Apr 23, 2026 9:51AM

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడీ శ్రీహరికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై  సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో  తనను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని  కోరుతూ ఆయన దాఖలు చేసిన విజ్ణప్తిని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.

  ఆయనను వెంటనే అరెస్టు చేస్తారనడానికి తగిన ఆధారాలు లేవని   అభిప్రాయపడింది. పూడి శ్రీహరిని ఈ కేసులో వెంటనే అరెస్టు చేస్తారనడానికి ఆధారాలు లేవని పేర్కొంటూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.  పూడి శ్రీహరి కేసులో హైకోర్టు నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 29న జరగబోయే విచారణలో కోర్టు ఎనిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...