అయినా... జగన్ మారలేదు...
posted on: Aug 18, 2014 4:13PM
.jpg)
అయినా... జగన్ మారలేదు... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటి సమావేశాలు జరిగినప్పటి నుంచి తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మీద ఒకటే ఆశ పెట్టుకున్నారు. అదేమిటంటే, ఈ రెండు అసెంబ్లీ సెషన్ల మధ్యకాలంలో ఆయనలో ఏదైనా మార్పు వస్తుందేమోననని!! కానీ ఆయనలో ఎంతమాత్రం మార్పు రాలేదు. నేనింతే అని తన పంథాలో తాను వెళ్తూనే వున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమర్థ నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అవసరం ఎంతో వుంది. అలాంటి ప్రతిపక్షం పాత్రను వైసీపీ ధరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వుంది. అయితే జగన్ ప్రజల అభిప్రాయానికి ఎంతమాత్రం విలువ ఇవ్వకుండా తన రాజకీయ వ్యూహాలలో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
ఏపీ అసెంబ్లీ మొదటి సమావేశాలను ఆయన ఇలాంటి విమర్శలతోనే వృధా చేశారు. తొలి సమావేశాలు జగన్ ఎలాగూ వృధా చేశారు. ఈ వర్షాకాల సమావేశాల నాటికి అయినా జగన్‌లో మార్పు వస్తుందని జనం భావించారు. ఆ సమావేశాలకు, ఈ సమావేశాలకు మధ్యకాలంలో జగన్ తనను తాను పరిశీలించుకుంటారని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అర్థం చేసుకుని పాలక పక్షానికి సహకరిస్తారని ఆశించారు. అయితే జగన్ వారి ఆశలను వమ్ము చేసేశారు. సోమవారం ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలలో జగన్ పక్షం తన విశ్వరూపాన్ని మరోసారి చూపించడంతో అసెంబ్లీ ఎంతమాత్రం జరగకుండానే మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నాడు జగన్ కాస్తంత అయినా నిర్మాణాత్మకంగా వ్యవహరించి వుంటే అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద చక్కని చర్చ జరిగి మంచి పరిష్కార మార్గాలు అభించి వుండేవి. అయితే జగన్ ఆ అవకాశం ఇవ్వలేదు. తాను ఎంతమాత్రం మారలేదని జగన్ మరోసారి నిరూపించుకున్నారు. మంగళవారం నుంచి అయినా జగన్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే బాగుంటుంది.



.jpg)
.jpg)

.webp)



