అయ్యో జగన్.. ఇదీ ఫెయిల్ అయ్యిందా..!

posted on: Jul 12, 2016 2:56PM

 

ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అన్నట్టు ఉంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఎందుకంటే ఎప్పడు ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ఏకి పారేద్దామా అని చూసే జగన్ కు.. ఎప్పుడూ అడ్డంకులే ఎదురవుతాయి. ఏదో చేద్దామనుకుంటారు.. అది కాస్త ఇంకేదో అవుతుంది. ఇప్పుడు ఆయన చేపట్టిన గడప గడపకి వైసీపీ కార్యక్రమం కూడా అలానే అయింది.


ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినాకానీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని.. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని.. వారి మోసాలను ప్రతి ఇంటికి తెలియజేయాలని చెబుతూ.. జగన్ ఆధ్వర్యంలో గడప గడపకి వైసీపీ అన్న పేరుతో కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించిన మొదట్లో స్పందన బాగానే వచ్చినా.. ఆతరువాత మాత్రం రానురాను ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. ఇక మొదటి నుండి ఈ కార్యక్రమంపై కారాలు, మిరియాలు నూరుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు ఊరుకుంటారా.. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఎంట్రీ ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని తిప్పుకొట్టేందుకు రంగంలోకి దిగిపోయి.. వైసీపీకి ధీటుగా గడప గడపకీ జగన్ దిష్టిబొమ్మ దహనం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఆందోళనలు తలెత్తి కొట్టుకునే పరిస్థితి వరకూ వెళ్లింది. ఇక పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఏది ఏమైనా జగన్ ప్లాన్ ను ఇలా తిప్పికొట్టినందుకు తెలుగు తమ్ముళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. మరి జగన్ ఇంకేం ప్లాన్ వేస్తాడో చూడాలి.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...