వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

posted on: Jun 5, 2026 2:40PM

వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడు గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.  ఆయన ముందస్తు బెయిల్ కోసం బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది.    దీంతో, కాంచీపురంలో బ్రహ్మనాయుడు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడ అరెస్ట్ చేసారు. 

 నకిలీ జీవోలు, దొంగ పత్రాల ఆధారంగా గండిపేటలో  వెయ్యి కోట్లుకు పైగా విలువైన   భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించిన  కేసులో బ్రహ్మనాయుడు నిందితుడు.  హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ పరిధిలో భూములు అక్రమంగా సొంతం చేసుకునేందుకు బ్రహ్మనాయుడు,  మరి కొందరు కుట్ర చేసారు. తాము ఏ భూమికి సంబంధించి కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా.. బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని.. నకిలీ జీవోల సంగతి ఆయనకు తెలుసని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...