ఆల్రెడీ ఓడిపోయిన యుద్ధం చేస్తున్న వైసీపీ.!

posted on: Aug 11, 2026 2:04PM

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.   ఇది వైసీపీ హయాంలోని వైఫల్యాలను స్పష్టంగా ఎత్తి చూపింది. ఎందుకంటే  ఈ విషయంలో జగన్  అధికారంలో ఉన్న ఐదేళ్లలో పూర్తిగా విఫలమయ్యారు. దానిని కప్పి పుచ్చుకోవడానికే వైసీపీ మెగా డీఎస్సీలో అవకవకలు, అక్రమాలూ అంటూ ఆరోపణలు గుప్పిస్తూ..రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగిందన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది.

 అది పక్కన పెడితే.. ఈ నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.  వైసీపీ నిరసనలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వినా మరెవరూ హాజరు కావడం లేదు సరికదా.. జగన్ కు కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలోనే వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, ఉపాధ్యయులు, విద్యార్థలు భారీ ర్యాలీ నిర్వహించారు.  

ఇది మెగా డీఎస్సీపై ప్రజలలో ఇసుమంతైనా ప్రతికూలత లేదనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ కోర్టుకు ఎక్కినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నది ఆల్రెడీ ఓడిపోయిన యుద్ధమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది.  

 Mega, Dsc, protests, People, Avoid, Jagan, Participate

google-ad-img
    Related Sigment News
    • Loading...