Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గతం మరిచారా జగన్?
posted on: Jul 21, 2026 3:41PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కరోనా కాలం నాటి తీవ్ర కలకలానికి కారణమైన డాక్టర్ సుధాకర్ ఉదంతం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొవిడ్ సమయంలో తాము అందించిన వైద్య సేవలు, ఆరోగ్య రంగానికి చేసిన మేలు గురించి ప్రకటనలు చేయడంతో పాటు రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదంటూ వైసీపీ విమర్శలు గుప్పించడంతో డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ నెటిజనులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో కరోనా మహమ్మారి తొలి విడత ఉధృతంగా ఉన్న సమయంలో, నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ కే. సుధాకర్ రావు ప్రభుత్వ వైద్యులకు, సిబ్బందికి ప్రాథమిక రక్షణ పరికరాలైన ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో లేవని బహిరంగంగా విమర్శించారు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు కనీస రక్షణ కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి వైసీపీ సర్కార్.. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే నెపంతో వేధింపులు ప్రారంభించింది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి. పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ కేజీహెచ్‌కు, ఆ తర్వాత మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఈ దారుణ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించి, పోలీసుల దాష్టీకంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ వేధింపులు, మానసిక ఒత్తిడి తాళలేక చివరకు సుధాకర్ గుండెపోటుతో కన్నుమూశారు.
ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ కొవిడ్ సమయంలో తాము అద్భుతంగా పనిచేశామని, వైద్య కళాశాలలు నిర్మించామని చెప్పుకుంటూ.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నా అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ వైసీపీ విమర్శల పర్వం మొదలు పెట్టింది. మందులు లేవు.. మాస్కులు లేవు అంటూ వైసీపీ సొంత మీడియా సోషల్ మీడియా కథనాలు వండి వారుస్తోంది. కరోనా కేసులో క్రమంగా పెరుగుతున్నా పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు, ఏర్పాట్లు, వాక్సినేషన్ వంటివి ఏర్పాటు చేయలేదని, ఈ కారణంగా కరోనాతో చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆ కథనాల్లో పేర్కొంటోంది. దీంతో గతం మరిచారా జగన్ అంటూ.. డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ycp carona comments, netizens remember, sudhakar, incident



.webp)


