జగన్ కు పెద్దిరెడ్డీ ధిక్కార స్వరం వినిపించారుగా.!

posted on: Jul 25, 2026 2:28PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీది నిస్సందేహంగా విలక్షణ శైలి. ఆ పార్టీ రాజకీయం అంతా దూషణలు, ప్రతీకారాలతో నిండి ఉంటుంది.  వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం.. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన నేతలంతా బేడ్ మౌతింగ్ చేసిన వాళ్లే కావడం గమనార్హం, గతంలో అసభ్య భాషలో దూషణలు, అనుచిత వ్యాఖ్యలూ చేసిన వాళ్లనే ఆ పార్టీ అధినేత జగన్ ప్రోత్సహించేవారు.  అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు. 

అయితే వైసీపీలోని పలువురు సీనియర్లు మాత్రం ఈ తరహా ధోరణి పట్ల, ఆ ధోరణిని ప్రోత్సహిస్తున్న జగన్ పట్ల ఒకింత అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారుర. గత కొంత కాలంగా,  పార్టీ అంతర్గత సమావేశాల్లోనే కాకుండా మీడియాతో మాట్లాడే సందర్భంగా కూడా వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు పరోక్షంగానే అయినా చాలా స్పష్టంగా నోటి దురుసు కూడదని చెబుతున్నారు.  ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, సభ్యత మరచి మాట్లాడటం పార్టీకి నష్టమని అన్యాపదేశంగా చెబుతున్నారు. 

ఈ పరిస్థితి ఇలా ఉండగా, వైసీపీ కీలక నేత, జగన్ కు సన్నిహితుడు అయిన పెద్ది రెడ్డి అయితే.. దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు తన నోటి నుంచి రావనీ, హుందాతనంతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. అక్కడితో ఆకకుండా తమ పార్టీలోని కొందరు నేతల్లా బాధ్యతారహితంగా, మర్యాద తప్పి మాట్లాడటం తనకు చేతకాదని పరోక్షంగా అంబటి రాంబాబు వంటి నాయకుల తీరును తప్పుపపట్టారు.  చూడాలి మరి పెద్దరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధినేత జగన్ ఎలా రియాక్టౌతారో?  

YCP, YS Jagan Mohan Reddy, YSRCP Firebrand, Badmouth Leaders, AP Politics, Telugu One

google-ad-img
    Related Sigment News
    • Loading...