ఆ రాష్ట్రానికి కొత్త సీఎం

posted on: Feb 3, 2026 6:35PM

 

మణిపూర్ రాజకీయల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ముఖ్యమంత్రిగా యమ్నాం ఖేంచంద్ సింగ్‌ను ఎంపిక చేసింది. సదీర్ఘ అస్థిరత తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్థరిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మణిపూర్ అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను భారతీయ జనాత పార్టీకి 37 మంది సభ్యుల బలం ఉంది.

 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా, ఇటీవల జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు బీజేపీలో చేరారు. ఇతర పార్టీల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు ఐదుగురు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఐదుగురు, కుకీ పీపుల్స్ అలయెన్స్ (కేపీఏ)కు ఇద్దరు సభ్యులు ఉండగా, ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు కూడా ఉన్నారు.

మణిపూర్‌లో గత కాలంగా మైతీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి ఖరారయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. శాంతి భద్రతల పునరుద్దరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కోనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...