సంతానం లేని దంపతులు లక్ష్యంగా దుండగుడు చోరీలు
posted on: Feb 9, 2026 3:25PM

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డాక్టర్ అవతారమెత్తిన ఓ కేటుగాడు, సంతానం లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నాడు. ఇటీవల ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు, తాను వైద్యుడినని చెప్పుకుని సంతానం కలిగే ప్రత్యేక ‘లిక్విడ్ ట్రీట్మెంట్’ ఉందని నమ్మబలికాడు. ఆ లిక్విడ్ రాసుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారని బురిడీ కొట్టించి, దంపతులను తన మాటలకు లోబర్చుకున్నాడు.
ఆ తర్వాత మెడలో ఉన్న బంగారం తీసేయాలని చెప్పి, వారి ఒళ్లంతా లిక్విడ్ పూసాడు. అనంతరం “ఇప్పుడు స్నానం చేసి రండి” అని చెప్పి, బంగారంతో పరారయ్యాడు. మోసపోయిన దంపతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


.webp)



