Latest News

ఏఐతో తప్పుడు తీర్పు.. పొరపాటు కాదు మిస్ కాండక్ట్.. సుప్రీం ఆగ్రహం

posted on: Mar 15, 2026 10:48AM

కృత్రిమ మేధ.. మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టీకరణ

సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నదో.. అంతకంటే వేగంగా సవాళ్ళూ  విసురుతోంది. మనిషి పనిని సులభం చేయాల్సిన   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)  ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదోవ పట్టించ డం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఈ విషయాన్నిదేశ సర్వోన్నత న్యాయస్థానం ఎత్తి చూపి ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకే పెనుముప్పుగా అభివర్ణించింది. 
విజయవాడ కోర్టు నకిలీ ఉత్తర్వుల ఆధారంగా ఓ ఆస్తివివాదాన్ని పరిషకరించిన ఉదయం వెలుగులోనికి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  వివరాల్లోకి వెడితే.. విజయవాడలోని   ట్రయల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గత ఏడాది ఆగస్టులో ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో ఓ ఆర్డర్ పాస్ చేశారు. అంతకుముందు ఆ ఆస్తిని సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ఓ అధికారిని నియమించింది. ప్రతివాదులు దీనిని వ్యతిరేకించారు. వారి అభ్యంతరాన్ని తోసిపుచ్చుతూ ఆ న్యాయమూర్తి నాలుగు పాత తీర్పులను ఉదహరించారు.   ప్రతివాదులు ట్రయల్ కోర్టు ఆర్డర్ ను హైకోర్టులో సవాల్ చేశారు.   ట్రయల్ కోర్టు ఉదహరించిన పాత తీర్పులు అసలు ఉనికిలోనే లేవని ఆధారాలు కోర్టు ముందు ఉంచారు. దీనికి అంగీకరించిన హైకోర్టు..  ట్రయల్ కోర్టు  ఉదహరించిన తీర్పులు ఉనికిలో లేకపోవచ్చు. కానీ కోర్టు సరైన న్యాయ సూత్రాలను పాటించి ఉంటే, కేవలం తప్పుడు తీర్పులను పేర్కొన్నంత మాత్రాన ఆ ఆర్డర్‌ను కొట్టివేయ లేమని పేర్కొంటూ దిగువ కోర్టు తీర్పును సమర్ధించింది.  ట్రయల్ కోర్టులో ఆర్డర్ పాస్ చేసిన జూనియర్ జడ్జి,  తాను ఏఐ టూల్‌  ఉపయోగించడం ఇదే మొదటిసారని, ఆ తీర్పులు నిజమైనవేనని నమ్మానని కోర్టుకు తెలిపారు. తప్పుగా ఉదహరించాలనే ఉద్దేశ్యం తనకు లేదని, ఆటోమేటిక్ సోర్స్ మీద ఆధారపడటం వల్లే ఈ పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు "కృత్రిమ మేధ   కంటే అసలైన మేధస్సు  కే ప్రాధాన్యత ఇవ్వాలి" అని సూచించింది. 

అయితే, సుప్రీంకోర్టు దీనిని అత్యంత తీవ్రంగా పరిగణించింది.  ఆస్తి వివాదంలో   దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తీర్పుల సమయంలో ఏఐ వినియోగాన్ని మిస్ కాండక్ట్ గా అభివర్ణించింది.   న్యాయ , నిర్ధారణ విషయంలో దీనిని వ్యవస్థాగత లోపంగా పేర్కొంది.   ఈ కేసును మరింత లోతుగా పరిశీలిస్తామని  పేర్కొంటూ అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా సుప్రీం కోర్టు న్యాయవాదులు పిటిషన్లు దాఖలుకు ఏఐ వినియోగించడంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.  

 అమెరికా, బ్రిటన్ దేశాలలో కూడా కోర్టులు ఏఐ వినియోగించి తప్పుడు తీర్పులు ఇచ్చిన ఉదంతాలు చోటు చేసుకున్నాయి.   అమెరికాలోని ఇద్దరు ఫెడరల్ జడ్జిలు ఏఐ వినియోగం కారణంగా ఇద్దరు న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇచ్చారు. అలాగే గత వల్ల తప్పుడు తీర్పులు ఇచ్చారు.  అలాగే ఇంగ్లాండ్ లో కూడా గత ఏడాది జూన్ లో నకిలీ తీర్పులను వాడొద్దని కోర్టు న్యాయవాదులను హెచ్చరించింది. ప్రస్తుతం భారత న్యాయవ్యవస్థ న్యాయస్థానాల్లో  ఏఐ వాడకాన్ని ఎలా నియంత్రించాలనే దానిపై కసరత్తు చేస్తోంది.  ఇప్పటికే  సుప్రీంకోర్టు విడుదల చేసిన  వైట్ పేపర్'లో న్యాయ సంస్థలు, లాయర్లు, క్లర్కులు ఏఐ వినియోగంలో పాటించాల్సిన మార్గదర్వకాలను విడుదల చేసింది.   

సాంకేతికత ఒక సాధనం మాత్రమే, అది మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదు కాలేదన్న విషయాన్ని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. విజయవాడ కోర్టు ఉదంతం కేవలం ఒక పొరపాటు కాదనీ, ఏఐ వినియోగం వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తోందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.    

google-ad-img
    Related Sigment News
    • Loading...