ప్రముఖ సాహితీ వేత్త.. అరసం నేత చందు సుబ్బారావు కన్నుమూత

posted on: Jan 30, 2026 8:16AM

ప్రముఖ రచయిత, సాహితీవేత్త. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నేత ప్రొఫెసర్ చందు సుబ్బారావు గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆంధ్రాయూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసిన ఆయన రచయితగా, భూభౌతిక శాస్త్రవేత్తగా, అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యులుగా క్రీయాశీలంగా వ్యవహరించారు.

 స్త్రీవాద, రాజకీయ, శాస్త్రీయ అంశాలపై పలు వ్యాసాలు, పుస్తకాలు రచించారు.    కవికి విమర్శకుడు శత్రువు కాదు వంటి అనేక రచనలు చేశారు.ఇటీవలే నాలుగు విమర్శా గ్రంథాలను ఓకే పుస్తకంగా వెలువ రించారు.  చందు సుబ్బారావుకు  తాపీ ధర్మారావు పురస్కారం, కొండేపూడి సాహితీ సత్కారం వంటి పలు పురస్కారాలు దక్కాయి.   రష్యన్‌ భాషలో జూనియర్‌ డిప్లొమా పొందారు. ఆచార్య చందు సుబ్బారావు మృతిపట్ల అరసం   నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందు సుబ్బారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...