జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో పిటిషన్
posted on: Feb 19, 2026 1:25PM

హైదరాబాద్ మహానగర పాలక సంస్థను మూడు కార్పొరేషన్లుగా విభజిం చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి చట్టపరమైన సవాల్ ఎదురైంది. ఈ మేరకు జారీ చేసిన జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయ వాది కోర్టుకు వివరించిన అంశాలు ఈ కేసులో ప్రధానంగా నిలిచాయి. 2027 జనగణన నేపథ్యంలో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ నెంబర్ 01 ప్రకారం ప్రస్తుతం జ్యూరి స్డిక్షన్ ఫ్రీజ్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ ఫ్రీజ్ కాలంలో మున్సిపల్ సరిహద్దులను మార్చడం, స్థానిక సంస్థలను పున ర్వ్యవస్థీకరించడం చట్ట విరుద్ధమని వాదించారు.
జీహెచ్ఎంసీ వంటి భారీ స్థానిక సంస్థను విభజిం చడం ద్వారా పరిపాలనా పరిధులు మారతాయని, ఇది సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల జీవో నెంబర్ 55ను తక్షణమే రద్దు చేయాలని కోరారు.ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రాథమిక విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న అనంతరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తమ వాదనలు వెల్లడించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కౌంటర్లు దాఖలైన తర్వాత తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. జీహెచ్ఎంసీ విభజన అంశం ఇప్పటికే పాలన, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. మహానగర పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు విభజన అవసరమని ప్రభుత్వం భావిస్తుండగా, చట్టపరమైన పరిమితులు, జనగణన ప్రక్రియపై ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు హైకోర్టు ముందు నిలిచాయి.
హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. కేంద్రం, రాష్ట్రం సమర్పించే కౌంటర్లలో ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణపై హైకోర్టు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్రంలోని స్థానిక సంస్థల పునర్వి భజనకు మార్గదర్శకంగా ఉండే అవకాశముంది.ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణపై రాజకీయ, పరిపాలనా, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


.webp)
.webp)


