ప్రపంచంలో గరిష్ట స్థాయికి చేరిన గోల్డ్ డిమాండ్

posted on: Jan 29, 2026 6:50PM

 

ప్రపంచంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల్లో పెట్టుబడులకు సురక్షిత మార్గంగా భావించడం వంటివి డిమాండ్ పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. పెట్టుబడుల రూపేణా బంగారం డిమాండ్ 2024లో 1,185.4 టన్నులుండగా, గతేడాది అది 2,175.3 టన్నులకు పెరిగింది. సెంట్రల్ బ్యాంకులు 2025లో 893 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ అత్యధికంగా 102 టన్నులు కొనుగోలు చేసింది. రికార్డు స్థాయి ధరల నేపధ్యలో గతేడాది ప్రపంచవ్యాప్తంగా అభరణాల డిమాండ్ తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది.  

2024తో పోలిస్తే అభరణాల డిమాండ్ 18 శాతం తగ్గింది. కానీ విలువల పరంగా 18 శాతం పెరగడం విశేషం. ఈ ఏడాది సైతంవ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అస్థిరతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు.  అయితే భారత్‌లో మాత్రం బంగారం డిమాండ్ తగ్గడం గమనార్హం. 2024తో పోలిస్తే 2025లో డిమాండ్ 100 టన్నులకు పైగా తగ్గిపోయింది. రికార్డు స్థాయిలో ధరలు, మారుతున్న వినియోగదారుల కొనుగోలు విధానాలు దానికి దారితీసినట్లు డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలిపింది. ఆ క్రమంలో 2026కు సంబంధించి దేశంలో బంగారం డిమాండ్ 600-700 టన్నులుగా ఉటుందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...