Latest News

కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న పీజీ హాస్టల్ నిర్వాహకులు

posted on: Mar 12, 2026 12:10PM

 

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు  కాలనీలో గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థలో వచ్చిన అంతరాయాల కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, KPHB కాలనీలోని శ్రేయసి లగ్జరీ పీజీ హాస్టల్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులకు ఆహారం అందించడంలో ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కనిపించారు. 

సరిపడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్యాస్ కొరత కారణంగా వంట ప్రక్రియ ఆలస్యం అవుతున్నప్పటికీ, విద్యార్థులకు భోజనంలో ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన సమస్యల ప్రభావం చిన్న వ్యాపార సంస్థలపై తీవ్రంగా పడుతున్నట్లు నిర్వాహ కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, పీజీ హాస్టళ్లు, చిన్నతరహా భోజనశాలలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హాస్టల్ నిర్వా హకులు కోరుతున్నారు. సరిపడా గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకు రాకపోతే హాస్టళ్ల నిర్వహణ కష్టసాధ్యమవుతుందని, చివరికి హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరించారు.స్థానికం గా గ్యాస్ సరఫరా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి కమర్షియల్ వినియోగదా రులకు సకాలంలో సిలిండర్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్వాహ కులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం KPHB కాలనీలో చోటుచేసుకున్న ఈ పరిస్థితి నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...