Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహిళాదినోత్సవం రోజున... రేప్‌చేసి తగలబెట్టేశాడు
posted on: Mar 9, 2016 2:15PM
.jpeg)
తెల్లవారితే దేశవ్యాప్తంగా మహిళాదినోత్సవాన్ని జరుపుకొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. అలాంటిది, దేశ రాజధాని దిల్లీకి కూతవేటు దూరంలో జరిగిన ఒక దారుణం, మహిళల భద్రత విషయంలో ఎలాంటి మార్పూ రాలేదని చెప్పకనే చెబుతోంది. దిల్లీకి దగ్గరలోని నోయిడాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో... అజయ్ శర్మ అనే యువకుడు తన ఇంటి పక్కనే ఉండే 15 ఏళ్ల అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు.
సోమవారం అర్థరాత్రి అజయ్ శర్మ ఆ ఇంట్లోకి ప్రవేశించి బాధితురాలి మీద అత్యాచారం చేశాడు. ఈ విషయం ఇంట్లోవారికి ఎక్కడ తెలుస్తుందో అన్న అనుమానంతో ఆమెను తగలబెట్టేశాడు. బాధితురాలి అరుపులు విని మేడ మీదకు వచ్చి చూసిన కుటుంబసభ్యులకు, ఆమె మంటల్లో చిక్కుకుని కనిపించింది. వెంటనే బాధితురాలిని దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు ఇవాళ ఉదయం చనిపోయింది. ఈ కేసులో నిందితుడు మైనర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే అతను తేలికపాటి శిక్షతో తప్పించుకోవచ్చు. ఈ నెల 8వ తేదీన మన దేశం ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకొంది!!!


.jpg)



