యువతి బలవన్మరణం
posted on: Feb 3, 2026 12:19PM
.webp)
తల్లికి మానసిక వైకల్యం, తనకు వివాహం జరగడంలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన తల్లికి ఉన్న వైకల్యం కారణంగా తనకు పెళ్లి జరగడం లేదన్న మనోవేదనకు లోనైన 23 ఏళ్ల తోష్నివాల్ విజయలక్ష్మీ బలవన్మరణానికి పాల్పడింది.
మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మీ కూకట్ పల్లి పరిధిలోని మైత్రినగర్ లో ఉంటోంది. ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా లేదు. యువతి ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఇటీవల వివాహ సంబంధాలు వచ్చాయి. అయితే మతిస్థిమితం లేని తన తల్లి కూడా తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి చెప్పడంతో వచ్చిన సంబంధాలు వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.






