Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వరకట్నం వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
posted on: Apr 18, 2026 2:35PM
.webp)
పెళ్లైన రెండేళ్లకే భర్త వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. నాగర్ కర్నూల్ లోని ఒక తండాకు చెందిన సంగీత (22) అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి నిమిత్తం హైదరాబాదు నగరానికి వచ్చి గౌలిగూడలో నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన వీరికి బంధువు అయిన నవీన్ ఆటో డ్రైవర్ కు ఇచ్చి సంగీతకు వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు.
తెలిసిన అబ్బా యికి తన కూతుర్ని ఇస్తే సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు 2024లో సంగీతకు నవీన్ తో ఘనం గా వివాహం జరిపించారు. ఆ సందర్భంగా ఆరు లక్షల కట్నంతో పాటు అన్ని లాంఛనాల ఇచ్చారు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన సంగీతకు వేధింపులు ఎదురయ్యాయి. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక తన తల్లిదండ్రు లకు చెప్పింది. అయితే సంగీత తల్లిదం డ్రులు పరిస్థితి మారుతుందని భావించి అల్వాల్ లో ఓ అద్దె ఇల్లు చూసి కూతురు, అల్లుడ్ని అందులో ఉంచారు అయినప్పటికీ నవీన్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
అదనపు కట్నం కావా లంటూ నవీన్ రోజూ సంగీతను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. రోజు రోజుకీ నవీన్ వేధింపులు మితిమీరి పోవడంతో సంగీత తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు. బంధువుల అబ్బాయికి ఇచ్చి తన కూతుర్ని చంపుకున్నా నంటూ తల్లిదండ్రులు బోరున వినిపించారు. తన కూతుర్ని అదనపు కట్నం కోసం అల్లుడు నవీన్ వేధింపులకు గురి చేసాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






