Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాట నీట్ నిరసనకారులపై కేసుల ఉపసంహరణ.!
posted on: Aug 3, 2026 11:12AM

నీట్ పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లో నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది
ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో చోటుచేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమైన ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ఈ క్రమంలో తమిళనాడులోనూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, యువత వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు ఆ సమయంలో శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా స్థానిక పోలీసులు ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు.
విద్యార్థులపై నమోదైన పోలీసు కేసుల వల్ల వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్ తక్షణ చర్యలకు ఉపక్రమించారు. నీట్ ఆందోళనల సమయంలో విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య మంత్రి విజయ్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా, నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ప్రతి కేసునూ ఉపసంహరించుకుంటున్నట్లు తమిళనాడు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తూ, తీవ్రమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల ఆవేదనను, వారి హక్కులను గుర్తించి మద్దతుగా నిలవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక అని విశ్లేషకులు అంటున్నారు.
Withdrawal of cases against NEET protesters in Tamil Nadu, CM Vijay, NEET protests, withdrawal of cases, Tamil Nadu news


.webp)



