బొత్స త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ లోకేష్, నాగబాబు ట్వీట్

posted on: Feb 28, 2026 8:13AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా బొత్స పూర్తిగా కోలుకోవాలని రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.

 ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బొత్స సత్యనారాయణ సత్వరమే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అదే విధంగా జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు కూడా బొత్స సత్యనారాయణ కోలుకుని ఆరోగ్యంగా తిరిగిరావాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. బొత్స సత్యనారాయణ కోలుకుని ప్రజాసేవలోకి తిరిగా రావాలని నాగబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...