వింటర్ ఒలింపిక్స్‌లో.... 10వేల కండోమ్స్ 3 రోజుల్లో ఖతం

posted on: Feb 13, 2026 9:12PM

 

మిలాన్ కోర్టినా వేదికగా వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్న క్రీడా గ్రామంలో ఓ విచిత్ర సమస్య వచ్చి పడింది. అథ్లెట్లకు నిర్వాహకులు అందించే కండోమ్స్ నిల్వలు నిండుకున్నాయి. నిర్వాహలకు దాదాపు 10వేలకు పైగా కండోమ్స్ ప్యాకెట్లు సరఫరా చేయగా కేవలం మూడు రోజుల్లో అయిపోయాయంట. దాంతో కొత్తగా మళ్లీ స్టాక్ తెప్పించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. క్రీడా గ్రామంలో వందల మంది అథ్లెట్లు,  స్టాప్ కలిసి ఉంటారు. వింటర్ సీజన్ అవ్వడంతో వారికి నిర్వాహకులే ఉచితంగా కండోమ్స్ ఇస్తుంటారు. 

2024 పారిస్ ఒలింపిక్స్ సమయంలో 2 లక్షలకు పైగ పురుష కండోమ్స్, 20 వేలకు పైగా మహిళల కండోమ్స్ 10,500 మంది అథ్లెట్లకు అందుబాటులో ఉంచడంతో అప్పట్లో సమస్య తలెత్తలేదు. ఇప్పుడు మిలాన్‌లో 2,900 మంది అథెట్లకు 10 వేలు మాత్రమే సప్లై చేయడంతో సమస్య వచ్చింది. గడ్డకట్టించే చలి కావడంతో ఇలాంటి ఈవెంట్లలో అథ్లెట్లు చాలా రోజులపాటు దగ్గరగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు గేమ్స్ కంటే ఆ వార్తలే వైరల్ అవుతుంటాయి. అందుకే నిర్వాహకులే అథ్లెట్లకు అవి సరఫరా చేస్తారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...