Latest News
వార్ ఎఫెక్ట్ ... విమాన టికెట్ ధరలకు రెక్కలు
posted on: Mar 14, 2026 7:19PM

విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానాయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టికెట్ ధరపై ఇంధన సర్‌ఛార్జి విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం (14-3-26 నుంచి) ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావమే ఈ పెరుగుదలకు కారణం. తాజాగా ఆకాశ ఎయిర్ దేశవాళీ, అంతర్జాతీయ రూట్లలో రూ.199నుంచి రూ.1,300వరకూ సర్‌ఛార్జీలను విధిస్తున్నట్టు తెలిపింది.
మార్చి 15వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. మార్చి 15వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఇది వర్తించదు. సెక్టార్, విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఫ్యూయెల్ సర్‌ఛార్జి ఉంటుందని ఆకాశ్ ఎయిర్ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫ్యూయెల్ సర్‌ఛార్జీలను సమీక్షిస్తామని పేర్కొంది. ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ షేర్ సుమారు 5 శాతం ఉన్న ఆకాశ్ ఎయిర్ సుమారు రెండు డజన్ల దేశీయ గమ్యస్థానాలు, కువైట్, దోహా, జెడ్డా, రియాద్, అబుదాబి సహా మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను నడుపుతోంది.


.webp)



