Latest News

మ్యాచ్ ఫిక్సింగ్ .. విండీస్ క్రికెటర్ జేవన్ సీర్లేస్ పై సస్పెన్షన్ వేటు

posted on: Mar 13, 2026 3:09PM

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విండీస్ క్రికెటర్  జేవన్ సీర్లెస్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది.  ఒక ప్రైవేట్ T10 క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్‌ జరిగిందని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం గుర్తించింది. ఈ కేసులో జేవన్ సీర్లెస్‌తో పాటు మరో ఇద్దరు అధికారులపై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. అవినీతి నిరోధక నియమావళి ప్రకారం మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు, అవినీతి చర్యలకు సహకరించడం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది.

సో ఆ విచారణ పూర్తయ్యే వరకూ అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచీ జేవన్ సీర్లెస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇలా ఉండగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించేందుకు ఐసీసీ జేవన్ సీర్లెస్ కు కొంత సమయం ఇచ్చింది. విచారణలో జేవన్ సీర్లెస్ దోషిగా తేలితే మరింత కఠిన శిక్షకు గురయ్యే అవకాశం ఉంది.  కాగా జేవన్ సీర్లెస్ గతంలో ఐపీఎల్ లో కూడా ఆడాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు.    

google-ad-img
    Related Sigment News
    • Loading...