డీజిల్‌, విమాన ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు!

posted on: Jun 16, 2026 10:23AM

అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ముడిచమురు సమీకరణాలు, పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  దేశం నుంచి ఎగుమతి అయ్యే డీజిల్, విమాన ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనిని   విండ్‌ఫాల్ ట్యాక్స్‌ అంటారు. ఈ విండ్ ఫాల్ టాక్స్ ను భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం (జూన్ 15)  నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అంతర్జాతీయంగా చమురు ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గుల నుంచి దేశీయ మార్కెట్‌ను రక్షించడంతో పాటు, ఎగుమతుల ద్వారా చమురు సంస్థలు ఆర్జిస్తున్న అదనపు లాభాలపై నియంత్రణ సాధించడమే లక్ష్యంగా విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచినట్లు పేర్కొంది. 

కేంద్రం  విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 50 పైసలు పెంచింది.  అదేవిధంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై   3 రూపాయలు పెంచింది.  ఈ సవరించిన కొత్త పన్ను రేట్లు మంగళవారం (జూన్ 16) నుంచే   అమల్లోకి వచ్చాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...