తమిళరాజకీయాలలో త్రిష మరో జయలలిత అవుతుందా?

posted on: Mar 18, 2026 2:40PM

సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, రాష్ట్రాలను ఏలారు. తమిళనాడులో ఎంజీఆర్, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లో తమదైన ముద్ర వేశారు. వారి బాటలోనే తమిళ, తెలుగు హీరోయిన్లు పొలిటికల్ స్క్రీన్‌పై   మెరిసారు. ఎంజీఆర్ సన్నిహితురాలు జయలలిత ఆయన తదనంతరం ఏఐడీఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎం పీఠం అధిరోహించి చక్రం తిప్పారు.  తాజాగా  స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారన్న ప్రచారం జోరందుకుంటోంది.  జయలలిత, ఎం.జే.ఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని త్రిష చూస్తున్నారని తెలుస్తోంది. 
తెలుగు, తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నది. ఇక ఇప్పుడు త్రిష రాజకీయ ప్రవేశం వెనక టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ ఉన్నారంటున్నారు.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని  ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి.  ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు  టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.

 త్రిష కారణంగానే వారి పెళ్లి పెటాకులవ్వబోతోందన్నది ఓపెన్ సీక్రెట్టే.  విషయం ఓపెన్ అయి పోవడంతో..  నిండా మునిగాక చలేముందిలే అన్నట్లుగా విజయ్ కూడా చాలా ఓపెన్ అయ్యాడు. భార్య బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని ప్రజలకు స్పష్టం చేయడానికా అన్నట్లు... ఇటీవల ఓ పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతో త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ పై వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది. 

 హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.  సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో  చెన్నై పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది.  చెన్నై నార్త్, సెంట్రల్, సౌత్ అసెంబ్లీ స్థానాల నుండి పలువురు నటీనటులు విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఎంజీఆర్,  తర్వాత జయలలిత,   మరో మాజీ సీఎం కరుణానిధి చెన్నై నగరం నుంచే గెలిచారు

 ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలోనే అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయించాలని భావిస్తున్నారని తమిళ పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ ఇవ్వని త్రిష, రానున్న ఎన్నికల్లో చెన్నైలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

ఏదిఏమైనా తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏఐడీఎంకే నేతలూ త్రిష‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళ రాజకీయాల్లో సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి త్రిష తమిళనాడు రాజకీయాల్లో మరో జయలలిత అనిపిం చుకుం టారో? లేకపోతే శశికళలా మిగిలిపోతారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...