Latest News
కరోనానే ఎదుర్కొన్నాం.. గ్యాస్ సంక్షోభం ఓ లేక్కా.. ప్రధాని మోడీ
posted on: Mar 13, 2026 11:55AM
.webp)
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభం తాత్కాలికమేనని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నట్లే, ఈ సంక్షోభాన్ని కూడా భారత్ అధిగమిస్తుందన్నారు. నిన్న జరిగిన నెక్స్ట్ సమ్మిట్లో ప్రసంగించిన ప్రధాని మోడీ ప్రపంచంలో నెలకొన్న యుద్ధాల వల్ల భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
ఎల్పీజీ లభ్యతపై భయాందోళనలు వద్దన్నారు. నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకునే అక్రమార్కులపై నిఘా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.
ఇంధన రంగంలో సవాళ్ల అధిగమించేందుకు ప్రపంచ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. దేశ ప్రజలకు అవసరమైన ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన భరోసా ఇచ్చారు.



.webp)


