ఏపీలో ప్రజలను హడలెత్తిస్తున్నా అడవి జంతువులు

posted on: Feb 8, 2026 11:52AM

 

ఏపీలో అడవి జంతువులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. జనావాసాల్లోకి జంతువులు రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి. తిమ్మసముద్రం-బుడ్డ‌మాను చెరువు స‌మీపంలో ఏనుగులు సంచ‌రిస్తూ క‌నిపించాయి. రెండు గజరాజులు క‌నిపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అట‌వీశాఖ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. మ‌రోవైపు నంద్యాల జిల్లాలో చిరుత పులి సంచ‌రిస్తోంది. 

వెలుగోడు రిజ‌ర్వాయ‌ర్ పంప్ హౌస్ స‌మీపంలో నెమ‌లిని వెంటాడుతుండ‌గా స్థానికులు చిరుత‌ను ఫోటో తీశారు. దీంతో మ‌త్య్స‌కారులు ఆ వైపు వెళ్లాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా పెద్దపులి బీభత్సం సృష్టించింది. కూర్మాపురం అనే గ్రామంలోకి పులి రాగా ఓ పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించింది. 

స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు స్పెషల్ టీమ్స్ సహాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని పట్టుకున్నారు. అనంతరం దానిని జూ పార్క్ కు తరలించారు ఇలా అడవి జంతువులు గ్రామాల్లోకి, ఇళ్లకు వద్దకు రావడంతో  అడవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని..  జంతువులను రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రజలు వాపోతున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...