Latest News

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

posted on: Mar 16, 2026 10:34AM

మేడ్చల్ జిల్లాలో ఆదివారం (మార్చి 15) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు. ఈ సంఘటన ముడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ దుర్ఘటనలో రాంనగర్‌కు చెందిన మర్రి ప్రశాంత్ , ఆయన భార్య శ్రావణి సంఘటనా స్థలంలోనే మరణించగా, వారి కుమారుడు 12 ఏళ్ల సహస్రార్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న శ్రావణ్ తన భార్య శ్రావణి, కుమారుడు సహస్రార్ లతో కలిసి రాంనగర్ నుంచి మేడిపల్లిలోని బంధువుల ఇంటికి బైక్ పై వెడుతుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది.  ఈ ప్రమా దంలో బైక్ నడుపుతున్న ప్రశాంత్ కి తీవ్ర గాయలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భార్య శ్రావణి , కుమారుడు సహస్రార్  తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...