Latest News
హార్థిక్ పాండ్యానా అబ్రారా ఎవరుబెటర్ ప్లేయర్?
posted on: Mar 24, 2026 11:01AM

క్రికెట్ ప్రపంచంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తీసుకున్న ఒక నిర్ణయం పెను దుమారానికి దారితీసిన సంగతి విదితమే. ఆ వివాదం అలా కొనసాగుతుండగానే.. మరో చర్చ తెరమీదకు వచ్చింది. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ లలో ఎవరు బెటర్. ఎవరి మెరుగైన ఆటగాడు అన్న చర్చ రచ్చగా మారింది. ఈ చర్చ తెరమీదకు రావడానికి ఇంగ్లాండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కావ్యా మారన్ కు చెందిన ఫ్రాంచైజీ కోసం కొనుగోలు చేయడమే. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి అబ్రార్ అహ్మద్ లోని క్రికెట్ నైపుణ్యమే కారణమని, ఒక విధంగా చెప్పాలంటే అబ్రార్ అహ్మద్ ఇండియన్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కంటే బెటర్ ప్లేయరనీ అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణమయ్యాయి. అది పక్కన పెడితే.. ది హండ్రెడ్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కోసం అబ్రార్ అహ్మద్‌ను భారీ ధర వెచ్చించి మరీ కావ్య మారన్ దక్కించుకున్నారు. భారత్ తో జరగని, ఇండియాతో సంబంధం లేని హండ్రడ్ లీగ్ లో తన జట్టు కోసం పాకిస్థాన్ ప్లేయర్ ను సెలెక్ట్ చేసుకునే హక్కు ఆ ఫ్రాంచైజీకి ఉంది. అందులో సందేహం లేదు. మరి ఇండియాలో కావ్యామారన్ నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి కారణం.. అబ్రార్ అహ్మద్ తీరే. గతంలో అబ్రార్ అహ్మద్ భారత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అటువంటి వ్యక్తిని కావ్యామారన్ తన ఫ్రాంచైజీ జట్టు కోసం కొనుగోలు చేయడమేంటి? అంటూ నెటిజనులు ఫైర్ అవుతున్నారు.
అదే సమయంలో పాకిస్థాన్ నుంచి కావ్యామారన్ కు గట్టి మద్దతు లభిస్తోంది. నైపుణ్యం ఉంది కనుకనే అబ్రార్ అహ్మద్ కోసం అంత వెచ్చించి మరీ కావ్యామారన్ తన జట్టు కోసం కొనుగోలు చేసిందనీ, ఇందులో తప్పేముందనీ, ఒక ఆటగాడిలోని టాలెంట్‌ను గుర్తించినందుకు ఆమెను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడమేంటని పాక్ మాజీలు అంటున్నారు.
అబ్రార్ అహ్మద్ దగ్గర అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు ఉన్నాయని, అతడొక మ్యాచ్ విన్నరనీ అంటున్నారు. ఇక బీసీసీఐ కూడా కావ్యామారన్ నిర్ణయాన్ని సమర్ధించింది. విదేశీ లీగ్‌లలో పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు ఆయా ఫ్రాంచైజీల వ్యక్తిగత నిర్ణయమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ.. అయితే, ఐపీఎల్‌లో మాత్రం పాక్ ఆటగాళ్లపై ఉన్న నిషేధం కొనసాగుతుందనీ, భారత గడ్డపై జరిగే లీగ్‌లలో వారికి చోటు ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
అయితే కావ్యామారన్ ఇండియాకు వ్యతిరేకంగా అబ్రార్ అహ్మద్ సోషల్ మీడియా పోస్టుల పెట్టడంతో ఇండియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. టాలెంటే కాదు, క్రీడాకారుడికి క్రమశిక్షణ, నైతిక రుజువర్తన కూడా అవసరమేనంటున్నారు. ఆ వివాదం అలా ఉంటే.. ఇప్పుడు తాజాగా ఇంజమామ్ అబ్రార్ అహ్మద్ టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కంటే చాలా బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలుపై నెటిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
కావ్య మారన్ విదేశీ లీగ్ కోసం పాక్ ప్లేయర్‌ను ఎంచుకోవడాన్ని తప్పుపడుతూ.. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నిటికే మించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు కూడా తమ జట్టు యజమాని కావ్యామారన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ.. సన్ రైజర్ జట్టుకు తమ మద్దతును ఉపసంహరించుకుటామని వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద కావ్యామారన్ నిర్ణయంపై దేశభక్తి కోణంలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, క్రీడల్లో ట్యాలెంట్ కే అగ్రతాంబూలమని, మిగిలిన విషయాలకు ప్రాధాన్యత ఉండదని కొందరంటున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు నెలకొన్న ఈ వివాదం ఎంత వరకూ వెడుతుందో చూడాలి.






